![]() |

కుటుంబంతో కలిసి చూసే సినిమాలు, సిరీస్ లు చాలా తక్కువగా వస్తుంటాయి. అందులోను ఈ మధ్యకాలంలో యూత్ ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది దర్శక నిర్మాతలు రొమాన్స్, థ్రిల్లర్ జానర్ ల వైపు వెళ్తుంటే.. ఆదిత్య హసన్ మాత్రం కుటుంబంతో కలిసి చూసేలా 90's టైమ్ లో విద్య, సమాజంలో పెద్దలకి పిల్లలకి మధ్య బంధం ఎలా ఉండేదో వివరిస్తూ, అప్పటి పరిస్థితులను మళ్ళీ రీక్రేయిట్ చేసాడు.
ఇక ఆ సీన్లని చూస్తే మళ్ళీ ఆ రోజులకి తీసుకెళ్తాయి. మన ఇంటికి మావయ్య వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం పిల్లలు చేసే యాక్టింగ్.. అలా వాళ్ళు వెళ్తూ ఇచ్చిన డబ్బులని తిరిగి మన అమ్మనాన్నలు తీసుకోవడం.. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోతే వాటిని సంపాదించుకోవడం కోసం రూపాయి రూపాయి పోగుచేసుకోవడం.. కేబుల్ టీవీలో ఆదివారం వచ్చే సినిమా కోసం నాన్నని ఒప్పించడానికి పడే ఇక్కట్లు.. ఇలా ప్రతీ చిన్నది ఎన్నో జ్ఞాపకాలని పరిచయం చేస్తుంది. ఇది ఓ వెబ్ సిరీస్ అనేకంటే మనల్ని మళ్ళీ బాల్యానికి తీసుకెళ్ళిన ఓ జ్ఞాపకం అనొచ్చు.
ఈ సిరీస్ లో చంద్రశేఖర్ గా చేసిన శివాజీ, రఘు పాత్రలో మౌళి చక్కగా నటించాడు. ఆదిత్యగా నటించిన రోహన్ పాత్ర ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ సిరీస్ మొత్తంలో ఆదిత్య పాత్రకి ఎక్కువ మంది ఇంప్రెస్ అవుతున్నారు. ఇమ్ స్ట్రాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఈ బుడ్డోడి రీల్సే కన్పిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ఆదిత్య కామెడీని ఇన్ స్టా లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నతనంలో పరీక్షల్లో మార్కులు వచ్చినప్పుడు నాన్న దండించే సీన్ లో ఆదిత్య హావభావాలు ప్రతీ ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అప్పట్లో వెంకీ సినిమాలో మాస్టర్ భరత్ చేసిన కామెడీలా అనిపిస్తుంది. అప్పట్లో భరత్.. ఇప్పుడు రోహన్ అనేలా ఈ బుడ్డోడి నటన ఉంది. అంతేకాదు రోహన్ ఇప్పటికి చాలా సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఈ ఒక్క సిరీస్ తో వచ్చేసింది. ఇక నెట్టింట ఈ రీల్ చూసిన 90's సిరీస్ తాలుకా కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ రోహన్ కామెడీకి నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
![]() |